ఎన్ని తిట్టినా అందుకే భరిస్తున్నా – బాబు

0
85

 

చంద్రబాబుకు తన పైన ఆక్రోశం ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల తప్పకుండా తనకు కోపం, ఆవేశం, బాధ ఉన్నాయన్నారు.అంతే కానీ తనకు వ్యక్తిగత అజండా ఎమీ లేద్ని, తన కోపానికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. అందుకే కేంద్రంపై తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని, ఇప్పటివరకు 11 ధర్మపోరాట దీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.

బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని,ఎవరు ఎన్ని బెందిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం,ఈ పోరాటంపై భావితరాల భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నరు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవడంతో తాను ఆక్రోశంతో ఉన్నానని, దేశంలో పెట్టే మహాకూటమి విజయవంతం కాదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మోదీపై విరుచుకుపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని,పెద్ద నోట్ల రద్దు చేసి గొప్ప వాళ్ళకు మేలు చేసారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here