ప్రత్యక్ష పోరుకు సిద్ధమయిన ప్రకాష్ రాజ్

0
72

కొత్త ఏడాది విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సోమవారం ట్విటర్‌ లో ప్రకటించారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మద్దతుతో నేను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయబోతున్నాను. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశాన్ని త్వరలో వెల్లడిస్తాను.’’ అని ట్వీట్‌ చేశారు.

వివిధ అంశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రకాశ్‌ రాజ్‌ గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలైన కన్నడ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యానంతరం ఆయన తన విమర్శలకు మరింత పదును పెరిగింది. ఇప్పుడు వరకూ సినీరంగానికే పరిమితమయిన ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here