కొత్త సంవత్సరంలొ కొలువుదీరిన ఏపీ హైకోర్టు

0
89

ఆంధ్రప్రదేశ్‌ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొన్నారు.
బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్‌ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది.ఇప్పటికే హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్‌ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మిగతా న్యాయమూర్తులు..

1. జస్టిస్ వెంకట నారాయణ భట్టి

2. జస్టిస్ వెంకట శేష సాయి

3. జస్టిస్ సీతారామ మూర్తి

4. జస్టిస్ దుర్గా ప్రసాద రావు

5. జస్టిస్ సునీల్ చౌదరి.

6. జస్టిస్ సత్యనారాయణ మూర్తి

7. జస్టిస్ శ్యాం ప్రసాద్

8. జస్టిస్ ఉమ దేవి

9. జస్టిస్ బాలయోగి

10. జస్టిస్ రజని

11. జస్టిస్ వెంకట సుబ్రమణ్య సోమయాజులు

12. జస్టిస్ విజయ లక్ష్మి

13. జస్టిస్ గంగా రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here