కొత్త ఏడాది కుంటుంబ సమేతంగా ‘యన్‌టిఆర్‌’

0
78

కొత్త సంవత్సరం సందర్భంగా ‘యన్‌టిఆర్‌’ తన కుటుంబంతో విచ్చేసి నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగానే కాదు.. ఇందులో బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యా బాలన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌లో ఎన్టీఆర్‌(బాలకృష్ణ‌)..తన సతీమణి బసవతారకం(విద్యాబాలన్‌)తో కలిసి మనవడికి నామకరణం చేస్తున్నట్లుగా ఎంతో చూడ ముచ్చటగా ఉంది. ఈ పోస్టర్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here